breaking news
Sumana Kittur
-
చిరకాల మిత్రుడిని పెళ్లాడిన దర్శకురాలు
పుదుచ్చేరి: కన్నడ సినిమా దర్శకురాలు, నిర్మాత సుమన కిత్తూరు వివాహం చేసుకున్నారు. చిరకాల మిత్రుడైన ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్‌ను పుదుచ్చేరిలో మనువాడారు. గత కొంత కాలంగా సుమన పుదుచ్చేరిలోనే నివాసముంటున్నారు. షిమోగాలోని ఓ దేవాలయంలో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటైనట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమలులో ఉండటంతో కేవలం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం శాశ్వతంగా ఈ జంట బెంగళూరుకు మకాం మార్చనున్నారు. (లాక్డౌన్ ఉల్లంఘన.. నటుడిపై తుమ్మిన వ్యక్తి! ) అయితే వీరి వివాహం ఏప్రిల్ 17 నే జరిగినట్లు సమాచారం. కాగా ఆదివారం(మే 24) పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పత్యక్షమవడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక సుమన స్లమ్ బాలా, కిరియురినా గయాలిగలు, ఎడెగారికా వంటి ప్రశంసలు అందుకున సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ‘ఆ దినగలు’ చిత్రంతో అసోసియేట్ డైరెక్టర్, గేయ రచయితగా తన వృత్తిని ప్రారంభించిన సుమన.. కల్లారే సాంటే, ఎడెగారికే చిత్రాలకు రెండు కర్ణాటక రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆమె సినిమాలు చాలావరకు నేటి కాలంలో ఆధిపత్యం చెలాయించే సామాజిక వ్యతిరేక అంశాలతో కూడుకొని ఉంటాయి. (ఎన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో నేనూ చూస్తా: నితిన్ ) -
మండిపడ్డ మహిళా దర్శకురాలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక విధానసౌధ వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఆడంబర ఖర్చుపై విమర్శల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ విషయంపై సినీ దర్శకురాలు సుమనా కిత్తూరు కూడా స్పందించారు. కేవలం మూడు షార్ట్ ఫిల్మ్స్ నిర్మించేందుకు నాలుగు కోట్ల రూపాయల ఖర్చు ఎందుకవుతోందంటూ సుమనా కిత్తూరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము సినిమాలు నిర్మించినా కూడా ఇంత ఖర్చు చేయమని, అలాంటిది కేవలం మూడు లఘుచిత్రాలకే కోట్ల రూపాయలను ఖర్చు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం సుమనా కిత్తూరు వేసిన ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు ఆమె వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ పోస్టింగ్‌లను పెడుతున్నారు. శాండర్‌వుడ్‌లో కొద్దిమంది మహిళా డైరెక్టర్లలో ఒకరైన సుమన 2008లో స్లమ్ బాల సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. కళ్లారా సంతే, ఎదగారికె సినిమాలు తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలకు కర్ణాటక ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నారు.