చక్రి దర్శకత్వంలో... | List of Ravi Teja & Chakri movie together | Sakshi
Sakshi News home page

చక్రి దర్శకత్వంలో...

Dec 2 2015 10:09 PM | Updated on Sep 3 2017 1:23 PM

చక్రి దర్శకత్వంలో...

చక్రి దర్శకత్వంలో...

నూతన దర్శకులతో సినిమాలు చేయడానికి రవితేజ ఎప్పుడూ వెనకాడలేదు. కెరీర్ ఆరంభంలో

 నూతన దర్శకులతో సినిమాలు చేయడానికి రవితేజ ఎప్పుడూ వెనకాడలేదు. కెరీర్ ఆరంభంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘నీ కోసం’ చేశారు. స్టార్ హీరో అయ్యాక కూడా నూతన దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘భద్ర’, హరీశ్ శంకర్‌తో ‘షాక్’, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘డాన్ శీను’, బాబీతో ‘పవర్’ చిత్రాలు చేశారు. తాజాగా చక్రి అనే నూతన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు. రవితేజ నటించిన ‘బలుపు’, ‘పవర్’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేశారు చక్రి. అతను చెప్పిన కథ నచ్చడంతో రవితేజ అవకాశం ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement