అందాల రాక్షసి | lisa movie shooting in kodaikanal | Sakshi
Sakshi News home page

అందాల రాక్షసి

Jul 22 2018 1:10 AM | Updated on Jul 22 2018 1:10 AM

lisa movie shooting in kodaikanal - Sakshi

అంజలి

పెనం మీద దోశ వేస్తున్నారు నటి అంజలి. కానీ ఆ కాలిన దోశను ప్లేట్లో వేయలేదు. పెనంతో సహా డైరెక్టర్‌ ఫేస్‌ మీద విసిరి కొట్టారు. కోపంతో కాదులేండి. పొరపాటున డైరెక్షన్‌ మారి, డైరెక్టర్‌కి తగిలింది. ‘లీసా’ సినిమాలోని ఓ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా ఇది జరిగింది. షాట్‌కు కాస్త దూరంగా ఉండటంతో పెద్ద దెబ్బకూడా తగల్లేదట దర్శకునికి. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న హారర్‌ చిత్రం ‘లీసా’. రాజు విశ్వనాథ్‌ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సినిమాటోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ పీజీ ముత్తయ్య నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను హిందీలో కూడా డబ్‌ చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కొడైకెనాల్‌లో జరుగుతోంది. లొకేషన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఓ ఫొటోను ట్యాగ్‌ చేసిన రాజు మా సినిమాలో ‘గార్జియస్‌ ఘోస్ట్‌’ అని అంజలిని ఉద్దేశించి సరదాగా అన్నారు. బహుశా పెనం ఎఫెక్ట్‌కే అంజలికి ఈ బిరుదు ఇచ్చి ఉంటారు. ఇదిలా ఉంటే ‘లీసా’ చిత్రాన్ని 3డీలో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో ఉన్న 8కె హీలియం కెమెరా వాడుతున్నారు. ‘‘అందం, అభినయంతో పాటు తమిళం, తెలుగు మాట్లాడగలిగే కథానాయిక కావాలనుకున్నాం. అందుకే అంజలిని ఎంపిక చేశాం. దాదాపు 200 టైటిల్స్‌ అనుకున్నాం. ఫైనల్‌గా ‘లీసా’ అని ఫిక్స్‌ అయ్యాం. విభిన్నమైన హారర్‌ చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు దర్శకుడు రాజు.

Advertisement
 
Advertisement
Advertisement