లైఫ్ అనుభవించు రాజా.. | Life Anubhavinchu Raja Movie Released On Febrauary 7th | Sakshi
Sakshi News home page

ఇదో మాస్‌ సినిమా

Jan 31 2020 8:02 AM | Updated on Jan 31 2020 10:01 AM

Life Anubhavinchu Raja Movie Released On Febrauary 7th - Sakshi

రాజారెడ్డి మూవీ మేకర్స్ పతాకంపై, ఎఫ్ అండ్ ఆర్ సమర్పణలో రవితేజ (జూనియర్), శృతి శెట్టి, శ్రావణి నిక్కీ హీరోహీరోయిన్లుగా సురేష్ తిరుమూర్ దర్శకత్వంలో రాజారెడ్డి కందల  నిర్మించిన రామ్ కామ్ ఎంటర్‌టైనర్ ‘లైఫ్ అనుభవించు రాజా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 

రవితేజ మాట్లాడుతూ....
ఫిబ్రవరి 7న విడుదల కానున్న మాస్ సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి. సినిమా అంతా ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. మా డైరెక్టర్ సురేష్ గారు సినిమాను బాగా తీశారు. నాకు మా చిత్ర యూనిట్‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను. మమ్మల్ని ఇప్పటి వరకు ఆశీర్వదించారు. ఇకముందు కూడా మీ ఆదరాభిమానాలు కావాలని కోరారు.

హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ....
నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ‘లైఫ్‌ అనుభవించు రాజా’ సినిమాలో మంచి పాత్రతో మీ ముందుకు వస్తున్నాను. సినిమా చాలా జాలీగా ఉంటుంది. మా సినిమాను మీరందరూ చూసి హిట్ చెయ్యలని కోరుకుంటున్నానని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మాట్లాడుతూ...
సినిమాలో సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. టైటిల్‌కు తగ్గట్లు ఈ సినిమా ఫుల్ ఫన్‌గా ఉంటుంది. రీ రికార్డింగ్ కూడా సినిమాకు బాగా కుదిరింది. మా సినిమా సాంగ్స్‌ను హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

షాని పగడాల మాట్లాడుతూ ..
డైరెక్టర్ సురేష్ గారితో నాకు కొంత కాలంగా పరిచయం ఉంది. సినిమా చూశాము, చాలా బాగా వచ్చింది. మనిషి జీవితంలో కొన్ని ఆనంద క్షణాలు ఉంటాయి. అలానే ఈ సినిమాలో హీరోకు కూడా కొన్ని బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. అవి డైరెక్టర్ బాగా చూపించారు. అనుభవించు రాజా టైటిల్ సాంగ్ బాగుంది. చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలువుతున్నానన్నారు.

డైరెక్టర్ సురేష్ తిరుమూరు మాట్లాడుతూ....
ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. అందరూ సపోర్ట్ చేస్తే సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది. నిర్మాత రాజారెడ్డి గారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. అనుభవించు రాజా టైటిల్‌కు కరెక్ట్‌గా సెట్ అయ్యే స్టొరీ ఇది. అందరికి నచ్చే సినిమా అవుతుంది. మా చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కష్టపడి పనిచేశారు, రవితేజ, శ్రావణి, శృతి, షాని ఈ సినిమాతో బిజీ ఆర్టిస్ట్స్ అవ్వబోతున్నారు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 

ఈ సినిమాలో నటీనటులు: రవితేజ, శ్రావణి నిక్కీ, శృతి శెట్టి, షాని పగడాల, పవన్ నాగేంద్ర, సుహాస్. సంగీతం: రామ్, కెమెరామెన్: రజిని, ఎడిటింగ్: సునీల్ మహరాణా, నిర్మాత: రాజారెడ్డి కందల, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: సురేష్ తిరుమూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement