సంచలనాల 'లెజెండ్' | Legend movie teaser create sensation in social media | Sakshi
Sakshi News home page

సంచలనాల 'లెజెండ్'

Mar 6 2014 10:23 PM | Updated on Aug 29 2018 1:59 PM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన 'లెజెండ్' సినిమా విడుదలకు ముందే సంచలనాలు రేపుతోంది.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన 'లెజెండ్' సినిమా విడుదలకు ముందే సంచలనాలు రేపుతోంది. బుధవారం అభిమాని చేతుల మీదుగా విడుదల చేసిన లెజెండ్ టీజర్కు మంచి ఆదరణ లభించింది. సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో దీన్ని అభిమానులు వీక్షించారు. 26 సెకనుల నిడివున్న ఈ ప్రచార చిత్రాన్ని 12 గంటల్లోపు సుమారు 120000 మంది పైగా వీక్షించినట్టు చెబుతున్నారు. చేతిలో తుపాకీ పట్టుకుని బాలకృష్ణ ఠీవిగా కూర్చున్నట్టుగా ఇందులో చూపించారు. బాలయ్య మెడ మీద టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

టీజర్కు మంచి ఆదరణ లభించడం పట్ల దర్శకుడు బోయపాటి శ్రీను సంతోషం వ్యక్తం చేశారు. 'లెజెండ్' తప్పకుండా మంచి సినిమా అవుతుందని చెప్పారు. దేవీశ్రీ ప్రసాద్ మంచి సంగీతం అందించాడని తెలిపారు. బాలయ్యను కొత్తగా ప్రమోట్ చేయడానికి టాటూ వేశామని వెల్లడించారు. బాలయ్య కోసం ప్రత్యేకంగా బైకు, సఫారీ కారు తయారు చేయించామని బోయపాటి తెలిపారు. మార్చి 7న  ఆడియోను విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. మార్చి 28న 'లెజెండ్' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement