లవ టీజర్కి ముహూర్తం ఫిక్స్ | Lava teaser on august 7th | Sakshi
Sakshi News home page

లవ టీజర్కి ముహూర్తం ఫిక్స్

Aug 3 2017 10:39 AM | Updated on Sep 17 2017 5:07 PM

లవ టీజర్కి ముహూర్తం ఫిక్స్

లవ టీజర్కి ముహూర్తం ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తొలిసారిగా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తొలిసారిగా ట్రిపుల్ రోల్ లో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవల రిలీజ్ అయిన జై టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో ఇప్పుడు మరో క్యారెక్టర్ ను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ లవ క్యారెక్టర్ లో క్లాస్ లుక్ లో సందడి కనిపించనున్నాడు.

లవ టీజర్ ను రాఖీ సందర్భంగా ఆగస్టు 7 ఉదయం 10.35 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎన్టీఆర్ సరసన నివేథా థామస్, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement