
సంభీత్, నేహారత్నాకరన్ హీరో హీరోయిన్లుగా జై శ్రీ సంతోషిమాత ప్రొడక్షన్ పతాకంపై మోహన్ శ్రీ వత్సస దర్శకత్వంలో షంఖు, కిరణ్‌లు నిర్మిస్తోన్న సినిమా 'లాలిజో లాలిజో'. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో సంభీత్, హీరోయిన్ నేహారత్నాకరన్లు ట్రైలర్‌ని ఆవిష్కరించగా, పాటల రచయిత కాసర్ల శ్యామ్ లోగోని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..ఈ చిత్రం మా పాపలాంటిది. మా పాప చాలా అందంగా, అద్భుతంగా వచ్చింది. మాకు మంచి గుర్తింపు తెస్తుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. ఇది థ్రిల్లర్ కాదు, ప్యూర్ లవ్ స్టోరీ. మనకు తెలియకుండానే మన నాలుక మీద తిరిగే అందమైన ప్రేమ కథ ఇది. ఇది ఊహించని లవ్ స్టోరీ. దయచేసి రిలీజ్ రోజు మొదటి షో చూడండి. బాగాలేకపోతే సినిమా చూడవద్దని అందరికీ చెప్పండి. బాగుంటే పదిమందికి మంచి చిత్రమని చెప్పండి...అన్నారు. పాటల రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి అవార్డు వస్తుందని, రావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.