నా పేరు లాల్

‘నమస్కారం. నా పేరు లాల్.. లాల్‌సింగ్ చద్దా’ అని పరిచయం చేసుకుంటున్నారు ఆమిర్ ఖాన్. ప్రస్తుతం చేస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’ కోసం పంజాబీ సర్దార్‌గా ఆమిర్ ఖాన్ మారిపోయిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఫారెస్ట్ గంప్’ సినిమాకు ‘లాల్‌సింగ్ చద్దా’ హిందీ రీమేక్. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్ కథానాయిక. వయాకామ్ స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు ఆమిర్‌ఖాన్. వచ్చే ఏడాది క్రిస్మస్‌కు ఈ సినిమా రిలీజ్ కానుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి