విజయ్‌సేతుపతికి జంటగా లక్ష్మీమీనన్ | Lakshmi Menon act with vijaysethupati | Sakshi
Sakshi News home page

విజయ్‌సేతుపతికి జంటగా లక్ష్మీమీనన్

Mar 29 2016 3:24 AM | Updated on Sep 3 2017 8:44 PM

విజయ్‌సేతుపతికి    జంటగా లక్ష్మీమీనన్

విజయ్‌సేతుపతికి జంటగా లక్ష్మీమీనన్

నటుడు విజయ్‌సేతుపతి,లక్ష్మీమీనన్‌ల ఫ్రెష్ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుంది.

నటుడు విజయ్‌సేతుపతి,లక్ష్మీమీనన్‌ల ఫ్రెష్ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుంది. నానుమ్ రౌడీదాన్, సేతుపతి, కాదటుమ్ కడందుపోగుమ్ వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి రైజింగ్‌లో ఉన్న నటుడు విజయ్‌సేతుపతి. ఇక కొంబన్, వేదాళం, మిరుదన్ చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ సక్సెస్‌ఫుల్ నటిగా వాసికెక్కిన నటి లక్ష్మీమీనన్. ఈ లక్కీ జంట కలసి నటిస్తే ఆ చిత్రం క్రేజే వేరు.


అలాంటి చిత్రానికి విజయ్‌సేతుపతి, లక్ష్మీమీనన్‌లపై ఫొటో షూట్ ఇటీవల చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో జరిగింది. ఇంతకు ముందు విజయ్‌సేతుపతితో ఆరెంజ్ మిఠాయ్ చిత్రాన్ని నిర్మించిన కామన్ మ్యాన్ ప్రెజెంట్స్ సంస్థ అధినేత బి.గణేష్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా వాడీల్ చిత్రం ఫేమ్ రతన్‌శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మంచి యాక్షన్ అంశాలతో కమర్షియల్ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి రెక్క(వింగ్) అనే టైటిల్‌ను నిర్ణయించారు. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement