గుండెపోటుతో బాలీవుడ్ నటుడు మృతి | Lagaan actor rajesh vivek upadhyay passes way | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో బాలీవుడ్ నటుడు మృతి

Jan 15 2016 8:09 AM | Updated on Sep 3 2017 3:44 PM

గుండెపోటుతో బాలీవుడ్ నటుడు మృతి

గుండెపోటుతో బాలీవుడ్ నటుడు మృతి

ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ వివేక్ ఉపాధ్యాయ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మరణించారు. ఓ సౌత్ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఆయన హార్ట్ ఎటాక్ తో మృతి...

ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ వివేక్ ఉపాధ్యాయ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మరణించారు. ఓ సౌత్ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఆయన హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. లగాన్ సినిమాలో ఆయన నటించిన గోరన్ పాత్రతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు టివి షోలలోనూ రాజేష్ వివేక్ నటించారు.

రాజేష్ వివేక్, శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో తెరకెక్కిన జునూన్ చిత్రంతో 1978లో సినీరంగ ప్రవేశం చేశారు. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ రోల్స్ లో కనిపించిన రాజేష్ వివేక్, ఆ తరువాత కామెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో పెంబా పాత్రలో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఎన్నో మంచి పాత్రలతో అలరించిన రాజేష్ వివేక్ ఉపాధ్యాయ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement