నా టాప్‌ టెన్‌ మూవీస్‌లో ‘కురుక్షేత్రం’ ఒకటి

Kurukshethram Movie Pre Release Event - Sakshi

అర్జున్‌

‘‘35 సంవత్సరాల సినీ కెరీర్‌లో ఎంతో మంది దర్శక–నిర్మాతలతో పనిచేశా. స్థిరంగా కష్టపడుతూ వస్తే దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. ‘కురుక్షేత్రం’ నా 150వ సినిమా. నేను నటించిన టాప్‌ టెన్‌ మూవీస్‌లో ఇదొకటిగా నిలుస్తుంది. ఈ చిత్రంలో రియాలిటీకి దగ్గరగా ఉండే పోలీస్‌ పాత్ర చేశా. మంచి సినిమాలను ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని అర్జున్‌ అన్నారు. అర్జున్‌ హీరోగా అరుణ్‌ వైద్యనాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కురుక్షేత్రం’. ప్యాషన్‌ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనివాస్‌ మీసాల ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో అరుణ్‌ వైద్యనాథన్‌ మాట్లాడుతూ– ‘‘తమిళంలో మంచి విజయం సాధించిన ‘నిబునన్‌’ చిత్రాన్ని సాయిక్రిష్ణ, మీసాల శ్రీనివాస్‌గారు తెలుగులో విడుదల చేస్తున్నందుకు నా కృతజ్ఞతలు.

అర్జున్‌గారు డైరెక్టర్స్‌ యాక్టర్‌. 150 సినిమాలు చేసినా ఎక్కడా గర్వం లేకుండా డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌లా ఉంటారు. ప్రసన్న, వరలక్ష్మి, చందన అద్భుతంగా నటించారు’’ అన్నారు. ‘‘అర్జున్‌గారి 150వ సినిమా ‘కురుక్షేత్రం’ను మా బ్యానర్‌లో విడుదల చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు ప్యాషన్‌ స్టూడియోస్‌ అధినేత ఉమేష్‌ రెడ్డి. ‘‘దండుపాళ్యం 3’ సినిమా తర్వాత మేం తెలుగులో విడుదల చేస్తున్న చిత్రం ‘కురుక్షేత్రం’’ అన్నారు మీసాల శ్రీనివాస్‌. ‘‘అర్జున్‌ అంటే నాకు ఎంతో అభిమానం. మంచి మనిషి. మా అందరికీ ఎంతో స్ఫూర్తి. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి’’ అన్నారు హీరో శ్రీకాంత్‌. నిర్మాతలు తమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయికృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top