యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

ks 100 movie censor works - Sakshi

మోడలింగ్‌ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్‌ ఖాన్, శైలజ జంటగా నటించిన చిత్రం ‘కెఎస్‌ 100’. షేర్‌ దర్శకత్వంలో చంద్రశేఖరా మూవీస్‌ పతాకంపై వెంకట్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెలలో విడుదల కానుంది. షేర్‌ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. మా సినిమా ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన రావడంతో విజయంపై మంచి అంచనాలున్నాయి.

సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్‌ పనుల్లో ఉంది. ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి’’ అన్నారు. అక్షిత, అషి, పూర్వీసునీత, శ్రద్ధా, నందిని, కల్పన అజీమ్, సుమన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: నవనీత్‌ చారి, కెమెరా: వంశీ, నేపథ్యసంగీతం: రామ్‌ మోహన్‌ చారి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top