ఊరమాస్‌ కృష్ణుడు

Krishnarjuna Yudham Nani Krishnudu Look Out - Sakshi

సాక్షి, సినిమా : నేచురల్‌ స్టార్‌ నాని కొత్త చిత్రం కృష్ణార్జున యుద్ధం చిత్ర ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయ్యింది. భోగి పండుగ కానుకగా ఈ చిత్రంలోని కృష్ణుడు పాత్ర లుక్కును విడుదల చేశారు.

ఈ చిత్రంలో నాని ద్విపాత్రిభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఊరమాస్‌ గెటప్‌లో ఉన్న హీరో పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. గత చిత్రాల కంటే కాస్త భిన్నమైన పాత్రలోనే నాని నటించబోతున్నాడని పోస్టర్‌ చూస్తే అర్థమౌతోంది. 

వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా చిత్రాలతో సక్సెస్‌లు అందుకున్న మేర్లపాక గాంధీ కృష్ణార్జున యుద్ధం చిత్రానికి దరకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్‌, రుష్కర్‌ మీర్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. హిప్‌హాప్‌ తమీజ్‌(ధృవ ఫేమ్‌) సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక సంక్రాంతి సందర్భంగా రేపు అర్జున్‌ పాత్ర లుక్కును విడుదల చేయబోతున్నారు. వేసవిలో కృష్ణార్జున యుద్ధం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Back to Top