నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది ! | krishna gaadi veera prema katha next level | Sakshi
Sakshi News home page

నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది !

Feb 4 2016 11:36 PM | Updated on Aug 29 2018 9:26 PM

నెక్ట్స్ లెవెల్‌లో  ఉంటుంది ! - Sakshi

నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది !

భలే భలే మగాడివోయ్’ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రం తర్వాత నాని నటించిన చిత్రమిది.

‘‘ ‘భలే భలే మగాడివోయ్’ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రం తర్వాత నాని నటించిన చిత్రమిది. నాని తన నటనతో సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు. ఏడాదిన్నరగా ఈ చిత్రం కోసం పని చేశాం. టెక్నీషియన్స్ కొత్తవారైనా ప్రతి ఒక్కరూ ఎంతో సపోర్ట్ చే శారు. విశాల్ చంద్రశేఖర్ మంచి పాట లిచ్చాడు. యువరాజ్ ప్రతి ఫ్రేమ్‌ను చాలా డిఫరెంట్‌గా చూపించాడు’’ అని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు.

నాని, మెహరీన్ జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడింది. ‘‘ఈ చిత్రం ప్రేక్షకులకు విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఫీస్ట్ అవుతుంది. కొత్త సాంకేతిక నిపుణులైనా ఎంతో హార్డ్ వర్క్ చేశారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. విశాల్ చంద్రశేఖర్, యువరాజ్, కృష్ణకాంత్ తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement