దేవీ కెరీర్‌ బెస్ట్‌ అన్న గురూజీ | Kodi Ramakrishna Message To Devi Sri Prasad | Sakshi
Sakshi News home page

Apr 6 2018 3:39 PM | Updated on Apr 6 2018 5:37 PM

Kodi Ramakrishna Message To Devi Sri Prasad - Sakshi

సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌

రంగస్థలం సినిమాకు పనిచేసి ప్రతీ ఒక్కరూ ప్రశంసల వర్షంలో తడిపోతున్నారు. హీరో రామ్‌ చరణ్‌, హీరోయిన్‌ సమంత, దర్శకుడు సుకుమార్‌లతో పాటు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ను కూడా పొగడ్తలతో ముంచేస్తున్నారు. అయితే తాజాగా తనకు వచ్చిన  ఓ మెసేజ్‌ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రంగస్థలం సినిమా చూసిన సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ.. దేవీ శ్రీ ప్రసాద్‌ను ప్రశంసిస్తూ మెసేజ్‌ చేశారు.

‘నీ సంగీతంతో తెలుగు చలనచిత్ర రంగస్థలం మీద ఓ భారీ విజయాన్ని నమోదు చేశావు. గర్వంగా ఉంది’ అంటూ దేవీ శ్రీకి మెసేజ్‌ చేశారు కోడి రామకృష్ణ. తనకు సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన కోడి రామకృష్ణను దేవీ శ్రీ గురువుగా భావిస్తారు. అందుకే ఆయన ప్రశంసించటంతో దేవీ శ్రీ ఆనందానికి అవధుల్లేవు. అందుకే వెంటనే కృతజ్ఞతలు అంటూ కోడి రామకృష్ణ రిప్లయ్‌ ఇచ్చిన దేవీ ఆ మెసేజ్‌లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement