‘నా ముద్దుల కొడుక్కు చట్టబద్ధత వచ్చేసింది’

Kirron Kher Tweet On Article 377 Verdict - Sakshi

స్వలింగ సంపర్కం నేరం కాదని, గే సెక్స్‌కు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీం కోర్టు చారిత్రాత్మక​తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొనే భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై నెలకొన్న వివాదానికి స్వస్తి పలకడంతో ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) వర్గానికి ఊరట లభించింది. దీంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు సుప్రీం తీర్పును స్వాగతిస్తూ సోషల్‌ మీడియాలో తమ స్పందన తెలియజేస్తున్నారు.

బాలీవుడ్‌ ప్రముఖులు కరణ్‌ జోహార్‌, స్వరా భాస్కర్‌, అర్జున్‌ కపూర్‌ తదితరులు సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేయగా.. తాజాగా సీనియర్‌ నటి కిరణ్‌ ఖేర్‌ కూడా ఈ జాబితాలో చేరారు. అభిషేక్‌ బచ్చన్‌తో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన కిరణ్‌... ‘ నా ముద్దుల కొడుకుకు చట్టబద్ధత లభించింది. ఎల్జీబీటీ కమ్యూనిటీకి శుభాకాంక్షలు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు తెరదించిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు’  అంటూ ట్వీట్‌ చేశారు. ఆమె ట్వీట్‌ స్పందించిన అభిషేక్‌...  ‘అవును లెజండరీ తీర్పు’  అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే కిరణ్‌ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు.. మీ సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే 2008లో విడుదలైన దోస్తానా సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌, జాన్ అబ్రహాంలు ‘గే’ లుగా నటించారు. ఈ సినిమాలో అభిషేక్‌ తల్లిగా నటించిన కిరణ్‌ ఖేర్‌.. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ ట్వీట్‌తో చమత్కరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top