కిరాక్‌ ఉందంటున్నారు  – నిఖిల్‌

kirrak party movie success meet - Sakshi

నిఖిల్, సిమ్రాన్, సంయుక్తా హెగ్డే ముఖ్య తారలుగా శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కిరాక్‌ పార్టీ’. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ‘కిరాక్‌ పార్టీ’ నిఖిల్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ను సాధించి, విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ –‘‘కిరాక్‌ పార్టీ’ చిత్రానికి అన్ని చోట్లా విశేష స్పందన లభిస్తోంది. స్టూడెంట్స్‌కి బాగా కనెకై్టంది. నిర్మాతగా మాకు మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ ఇచ్చిన చిత్రమిది. ఓవర్సీస్‌లో అరమిలియన్‌ వసూళ్లను రాబట్టింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి విజయ యాత్ర నిర్వహించనున్నాం’’ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరు సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నారు. కిరాక్‌ ఉందంటున్నారు. మౌత్‌టాక్‌తో రోజురోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో సినిమా ఆడుతోంది. క్లైమాక్స్‌కి ముందు నా నటన బాగుందని అందరూ మెచ్చుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు నిఖిల్‌. ‘‘హ్యాపీడేస్‌ తర్వాత కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మంచి సినిమా ఇది’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘ప్రతి విద్యార్థి తమ కథగానే భావించి సినిమాను పెద్ద హిట్‌ చేశారు’’ అన్నారు శరణ్‌. ‘‘తెలుగులో తొలి అడుగుతోనే మంచి విజయం దక్కడం ఆనందంగా ఉంది’’ అన్నారు సంయుక్తా హెగ్డే. ఈ కార్యక్రమంలో హేమంత్, రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top