ఆ నటి నా కారును తిరిగి ఇవ్వడం లేదు! | Kim Sharma not returning my car, says businessman | Sakshi
Sakshi News home page

Apr 5 2018 9:30 AM | Updated on Apr 3 2019 6:34 PM

Kim Sharma not returning my car, says businessman - Sakshi

న్యూఢిల్లీ: తెలుగులో ‘ఖడ్గం’, ‘మగధీర’ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్‌ నటి కిమ్‌ శర్మ చిక్కుల్లో పడింది. ఆమె తన రేంజ్‌రోవర్‌ లగ్జరీ కారును వాడుకుంటూ తిరిగి ఇవ్వడం లేదని రాజస్థాన్‌కు చెందన ఓ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2017 సెప్టెంబర్‌లో వ్యాపారవేత్త దిలీప్‌కుమార్‌ ఈ విషయమై పోలీసులను ఆశ్రయించాడు. అయితే, పోలీసులు కిమ్‌ శర్మ పేరుకు బదులు విడిపోయిన ఆమె భర్త అలీ పుంజానీ పేరును పొరపాటును కేసులో నమోదుచేశారని తాజాగా ఆయన మీడియా ముందుకొచ్చారు.

ముంబైలో తనకు నివాసం లేదని, తరచూ రాజస్థాన్‌, ముంబై మధ్య ప్రయాణం చేస్తుండటంతో తన లగ్జరీ కారును కిమ్‌, ఆమె భర్త ఉండే ఖర్‌ రెసిడెన్సీలో పార్క్‌ చేసేవాడినని తెలిపాడు. కిమ్‌ తన లగ్జరీ కారును వాడుతున్న విషయం గత ఏడాది తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ‘కారు తిరిగి ఇవ్వాలని ఆమెను అడిగితే.. ఇది తన భర్త ఇచ్చాడని వాపస్‌  ఇవ్వడానికి నిరాకరించింది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కిమ్‌ ఇటీవల భర్త నుంచి విడిపోయి.. వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఈ విషయమై గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్య తీసుకోలేదని, అందుకే తాజాగా మరోసారి ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. తనకు మరాఠీ రాకపోవడంతో పోలీసు రిపోర్ట్‌లోని పొరపాటును చదవలేకపోయానని, ఇప్పుడు దానిని సవరించి ఫిర్యాదు చేసినా పోలీసులు చర్య తీసుకోవడం లేదని ఆయన అన్నారు. షారుఖ్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ‘మొహబతెం’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కిమ్‌ శర్మ ‘ఫిదా’, తుమ్‌సే అచ్చా కౌన్‌ హై, కహెతా హై దిల్‌ బార్‌ బార్‌ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో ‘మగధీర’ సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించింది. 2010లో వ్యాపారవేత్త అలీ పుంజానీని పెళ్లాడిన ఆమె.. ఇప్పుడు విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement