మరో న్యూడ్‌ ఫొటోతో ఘాటు సమాధానం! | Kim Kardashian posts another liberating nude picture | Sakshi
Sakshi News home page

మరో న్యూడ్‌ ఫొటోతో ఘాటు సమాధానం!

Mar 8 2016 8:17 PM | Updated on Sep 3 2017 7:16 PM

మరో న్యూడ్‌ ఫొటోతో ఘాటు సమాధానం!

మరో న్యూడ్‌ ఫొటోతో ఘాటు సమాధానం!

హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్‌ కిమ్ కర్దాషియన్‌ తన విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చింది.

హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్‌ కిమ్ కర్దాషియన్‌ తన విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. కిమ్‌ నగ్నంగా దిగిన సెల్ఫీని ట్విట్టర్‌లో షేర్ చేయడంపై దుమారం రేగింది. ఆమె తీరును సోషల్ మీడియాలో పలువురు తప్పుబట్టారు. నగ్నంగా దేహాన్ని చూపిస్తూ ఆమె క్రేజ్‌ తెచ్చుకోవాలని భావిస్తున్నట్టు సెలబ్రిటీలైన బెట్‌ మిడ్లర్, క్లోహి మోరెట్జ్, పీర్స్ మోర్గాన్ తదితరులు విమర్శించారు. ఈ విమర్శలకు సమాధానంగా కిమ్‌ కర్దాషియన్‌ మరో న్యూడ్ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టింది. దీనికి 'లిబరేటెడ్‌' (విముక్తి) అని అనే హ్యాష్‌ట్యాగ్‌ జోడించింది.

35 ఏళ్ల కిమ్‌ కర్దాషియన్ ఈ ఫొటోలో బ్లాక్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో తన అందాలను క్లాసికల్‌గా చూపించింది. తన ఛాతి, ప్రైవేటు అంగాలు కనిపించకుండా రెండు చేతులు అడ్డుపెట్టుకొని దిగిన ఈ ఫొటోను తన విమర్శకులకు సమాధానంగా పోస్టు చేసింది. తనపై విమర్శలు చేసిన క్లోహి మోరెట్జ్‌, బెట్‌ మిడ్లర్‌పై ఘాటుగా విరుచుకుపడుతూ వ్యాఖ్యలు చేసింది. టీన్‌ స్టార్‌ క్లోహి మోరెట్జ్‌ కిమ్‌ తీరును ట్విట్టర్‌లో ఏకిపారేసింది. యువతులు గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకునేలా మార్గనిర్దేశం చేయాల్సిన అవసరముందని, ఈ విషయాలేవీ చెప్పకుండా అస్తమానం దేహాన్ని ప్రదర్శించడం అంత మంచిది కాదని కిమ్‌కు హితవు పలికింది. సెలబ్రిటీ స్టేటస్‌కు ఎంత గౌరవముంటుందని, దానిని ఇలా బజారుకీడ్చడం సరికాదని, తాను ఇలాంటి పనులు ఎప్పటికీ చేయబోనని 19 ఏళ్ల  క్లోహి స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement