తెలుగులో 7న వస్తున్నవీరప్పన్ | Killing Veerappan is going to release in telugu on January 7th | Sakshi
Sakshi News home page

తెలుగులో 7న వస్తున్న వీరప్పన్

Jan 2 2016 2:17 PM | Updated on Jul 29 2019 5:43 PM

తెలుగులో 7న వస్తున్నవీరప్పన్ - Sakshi

తెలుగులో 7న వస్తున్నవీరప్పన్

రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం ఈ నెల 7వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం ఈ నెల 7వ తేదీన  తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా 1వ తేదీన విడుదలైన ఈ చిత్రం తమిళం, కన్నడంలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.  కాగా  ఈ నెల ఏడో తేదీన కిల్లింగ్ వీరప్పన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వర్మ ట్విట్ చేశారు.

 

కాగా  తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే తెలుగు వెర్షన్ మాత్రం సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయినట్లు సమాచారం. అందువల్లే చిత్ర నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement