‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌లో క్రేజీ భామ! | Kiara Advani May Play In Arjun Reddy Bollywood Remake | Sakshi
Sakshi News home page

Sep 25 2018 4:23 PM | Updated on Sep 25 2018 5:00 PM

Kiara Advani May Play In Arjun Reddy Bollywood Remake - Sakshi

టాలీవుడ్‌లో ‘అర్జున్‌ రెడ్డి’ సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. ఈ సినిమాలో తన నటనతో విజయ్‌ దేవరకొండ ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యాడు. ఇక ఇంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన అర్జున్‌ రెడ్డిని పలుభాషల్లో రీమేక్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళ్‌లో ‘వర్మ’ పేరుతో తెరకెక్కిస్తోండగా.. బాలీవుడ్‌లో షూటింగ్‌కు రెడీ అవుతోంది. 

సందీప్‌ వంగా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో షాహిద్‌ కపూర్‌ నటించగా, హీరోయిన్‌గా కియారా అద్వాణీ నటించబోతున్నట్లు సమాచారం. భరత్‌ అనే నేను సినిమాతో తెలుగులో పరిచయమైన ఈ భామ ప్రస్తుతం రామ్‌చరణ్‌-బోయపాటి కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కియారా అద్వాణీ రీసెంట్‌గా వచ్చిన ‘లస్ట్‌ స్టోరిస్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement