మా అమ్మాయి విడాకులు కోరడం సంతోషం | Khloe Kardashian's family happy about divorce | Sakshi
Sakshi News home page

మా అమ్మాయి విడాకులు కోరడం సంతోషం

May 28 2016 3:04 PM | Updated on Sep 4 2017 1:08 AM

మా అమ్మాయి విడాకులు కోరడం సంతోషం

మా అమ్మాయి విడాకులు కోరడం సంతోషం

రియాల్టీ టీవీ స్టార్ ఖ్లోయె కర్దాషియన్ తన భర్త, బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు లామర్ ఒడోమ్ (36) నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నందుకు ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

లండన్: రియాల్టీ టీవీ స్టార్ ఖ్లోయె కర్దాషియన్ తన భర్త, బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు లామర్ ఒడోమ్ (36) నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నందుకు ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 31 ఏళ్ల కర్దాషియన్ భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేసుకుంది. కర్దాషియన్ నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యులు సమర్థించారు.

కర్దాషియన్ 2009లో లామర్ను వివాహం చేసుకుంది. నాలుగేళ్ల పాటు వీరి బంధం సవ్యంగా సాగినా ఆ తర్వాత విభేదాలు వచ్చాయి. లామర్ డ్రగ్స్కు బానిస కావడంతో పాటు తనను మోసం చేశాడని కర్దాషియన్ ఆరోపించింది. డ్రగ్స్ వ్యసనం నుంచి కోలుకునేందుకు లామర్కు ఆమె సాయం చేసింది. అయితే అతనిలో మార్పు రాకపోవడంతో దూరం కావాలని కర్దాషియన్ నిర్ణయం తీసుకుంది. లామర్ నుంచి విడాకులు తీసుకుంటున్నందుకు ఆమె కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. ఆమె ఇక నుంచి పూర్తిగా తన కెరీర్పై దృష్టిసారించాలని నిర్ణయించుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement