ఎవరు ఆడారు? | Khayyum movie darty game audio released | Sakshi
Sakshi News home page

ఎవరు ఆడారు?

Oct 14 2016 11:17 PM | Updated on Sep 4 2017 5:12 PM

ఎవరు ఆడారు?

ఎవరు ఆడారు?

హాస్యనటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఖయ్యుమ్ (అలీ తమ్ముడు) ఫస్ట్ టైమ్ హీరోగా నటించిన చిత్రం

హాస్యనటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఖయ్యుమ్ (అలీ తమ్ముడు) ఫస్ట్ టైమ్ హీరోగా నటించిన చిత్రం ‘డర్టీ గేమ్’. అస్మిత కథానాయిక. షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై తాడి మనోహర్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సునీల్ కశ్యప్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని దర్శకుడు సాగర్, నిర్మాత ప్రసన్న కుమార్ విడుదల చేశారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘మంచి కథ కుదిరింది. డర్టీ గేమ్ ఏంటి? ఎవరెవరు ఆడారు? అన్నది ఆసక్తికరం. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ అంశాలన్నీ మా చిత్రంలో ఉంటాయి.

సునీల్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘పూరీ జగన్నాథ్ వంటి దర్శకులతో పని చేసిన నేను ఈ చిత్రం చేయడానికి కారణం కథ నచ్చడమే. పాటలు ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం ఉంది’’ అని సునీల్ కశ్యప్ అన్నారు. ఖయ్యుమ్, అస్మిత, కవిత, జీవీ, కోటా శంకర్ రావు, సునీల్ కుమార్  పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement