'మర్డర్‌ చేసినా ప్రశాంతంగానే చేయాలి' | KESHAVA THEATRICAL TRAILER released | Sakshi
Sakshi News home page

'మర్డర్‌ చేసినా ప్రశాంతంగానే చేయాలి'

May 13 2017 8:34 PM | Updated on Sep 5 2017 11:05 AM

'మర్డర్‌ చేసినా ప్రశాంతంగానే చేయాలి'

'మర్డర్‌ చేసినా ప్రశాంతంగానే చేయాలి'

గొప్పగా కొత్తగా చెప్పడానికి నాది కథ కాదు..బాధ.

కుడివైపు గుండెతో..కేశవ
హైదరాబాద్‌ : గొప్పగా కొత్తగా చెప్పడానికి నాది కథ కాదు..బాధ. నాకో ప్రాబ్లమ్‌ ఉంది. అందరికి ఎడమవైపుండాల్సిన గుండె, నాకు కుడి వైపుంది. దాని వల్ల ఎక్కువ కంగారుపడినా, భయపడినా హర్ట్‌ రేట్‌ పెరిగి చనిపోతాను. సింపుల్‌గా చెప్పాలంటే హర్రర్‌ మూవీ చూడలేను, స్పోర్ట్స్‌ ఆడలేను..ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి, మర్డర్‌తో సహా... అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ 'కేశవ'తో యంగ్ హీరో నిఖిల్ మన ముందుకొస్తున్నాడు. 'కేశవ' థియేట్రికల్ ట్రైలర్ శనివారం విడుదలైంది. తన ట్విట్టర్‌లో నిఖిల్‌ ట్రైలర్‌ను పోస్ట్‌ చేసిన తక్కువ వ్యవధిలోనే అభిమానులు తెగ రీట్వీట్‌లు చేస్తున్నారు.

థ్రిల్లింగ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా స్వామి రారా కాంబినేషన్ రిపీట్ అవుతుండటం.. నిఖిల్ లుక్, ప్రమోషన్ సూపర్బ్గా ఉండటంతో కేశవపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ట్రైలర్‌ నచ్చితే షేర్‌ చేయండంటూ నిఖిల్‌ ట్రైలర్‌తో పాటూ ఓ కామెంట్‌ పెట్టాడు. దీనికి రీప్లేగా.. నచ్చడం కాదు అదిరిపొయింది!!!! అంటూ రానా, అల్లరి నరేష్లు పొగడ్తలతో ముంచెత్తారు.

 

Advertisement
 
Advertisement
Advertisement