పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేసుకోండి

Kerala gives nod to post-production work for films - Sakshi

అనూహ్యమైన పరిస్థితుల్లో లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో చాలా సినిమాల పరిస్థితి అయోమయంగా మారింది. అయితే మే 4 నుంచి నిర్మాణానంతర కార్యక్రమాలు చేసుకోవచ్చని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు లేదా అంతకంటే తక్కువ మంది ఉండేట్టుగా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీంతో షూటింగ్‌ పూర్తయిన సినిమాల డబ్బింగ్, మ్యూజిక్, సౌండ్‌ మిక్సింగ్‌ పనులను చేసుకోవచ్చు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరిగే స్టూడియోలు బాగా శుభ్రంగా ఉండాలని, పని చేస్తున్న అందరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్‌ వాడాలని పేర్కొన్నారు కేరళ మంత్రి ఎ.కె. బాలన్‌. సినిమా షూటింగ్స్‌కి సంబంధించి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top