కోలీవుడ్ స్టార్ హీరోతో శైలజ | Keerthy Suresh to romance Vijay in Bharathan Movie | Sakshi
Sakshi News home page

కోలీవుడ్ స్టార్ హీరోతో శైలజ

Feb 10 2016 11:54 AM | Updated on Sep 3 2017 5:22 PM

కోలీవుడ్ స్టార్ హీరోతో శైలజ

కోలీవుడ్ స్టార్ హీరోతో శైలజ

నేను శైలజ సినిమాతో టాలీవుడ్లో సత్తా చాటిన మళయాలి భామ కీర్తీ సురేష్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం తేరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న...

నేను శైలజ సినిమాతో టాలీవుడ్లో సత్తా చాటిన మళయాలి భామ కీర్తీ సురేష్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం తేరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న తమిళ స్టార్ హీరో విజయ్, నెక్ట్స్ సినిమాలో కీర్తిని హీరోయిన్గా ఫైనల్ చేశారు. ఏప్రిల్ వరకు తేరి షూటింగ్ కొనసాగుతుండటంతో మేలో విజయ్, కీర్తిల కాంబినేషన్లో సినిమా ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు స్టార్ హీరోల సరసన నటించని కీర్తీ సురేష్కు ఇది క్రేజీ ఆఫరే అంటున్నారు సినీ ప్రముఖులు.

భరతన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ముందుగా కాజల్ అగర్వాల్ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. గతంలో కాజల్, విజయ్ల కాంభినేషన్లో వచ్చిన తుపాకి ఘన విజయం సాధించటంతో మరోసారి అదే మ్యాజిక్ను రిపీట్ చేయాలని భావించారు. కానీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన రజనీ మురుగన్ సినిమాతో కీర్తీ సురేష్ తమిళనాట మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో కాజల్ను కాదని కీర్తినే ఈ సినిమాకు హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement