స్టార్‌ హీరో సరసన మరో ఛాన్స్‌ | Keerthy Suresh to romance Vijay in Thalapathy 62 | Sakshi
Sakshi News home page

Jan 3 2018 3:21 PM | Updated on Jan 3 2018 3:21 PM

Keerthy Suresh to romance Vijay in Thalapathy 62 - Sakshi

టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సంక్రాంతి రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటించిన అజ్ఞాతవాసి సినిమాతో పాటు కోలీవుడ్‌లో సూర్య సరసన నటించిన గ్యాంగ్ సినిమాలు సంక్రాంతి బరిలోనే రిలీజ్ అవుతున్నాయి.

తాజాగా మరోసారి కోలీవుడ్ టాప్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది కీర్తిసురేష్. ఇలయదళపతి విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో విజయ్ సరసన భైరవ సినిమాలో కలిసి నటించింది కీర్తి సురేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement