రజనీ వ్యూహం? | Keerthy Suresh to romance Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీ వ్యూహం?

Nov 2 2019 3:30 AM | Updated on Nov 2 2019 3:30 AM

Keerthy Suresh to romance Rajinikanth - Sakshi

రజనీకాంత్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కోసం మాస్‌ డైరెక్టర్‌ శివ సరికొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇది రజనీకాంత్‌ కెరీర్‌లో 168వ చిత్రం. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట చిత్రబృందం. అలాగే సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం జ్యోతిక, కీర్తీ సురేశ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. మరోవైపు డైరెక్టర్‌ శివ దర్శకత్వంలో వచ్చిన హిట్‌ చిత్రాలు ‘వీరమ్, వేదాలం, వివేగమ్, విశ్వా సం’ తర్వాత మరోసారి ‘వి’ సెంటిమెంట్‌తో ఆయన సినిమా టైటిల్‌ తెరపైకి రావడం విశేషం. ఇంతకుముందు డైరెక్టర్‌ శివ తెలుగులో ‘శౌర్యం, శంఖం, దరువు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement