ముద్దు సన్నివేశాల్లో నో చెప్పకూడదన్నారు | Keerthy Suresh Rejects Glamour Roles In Previous Movies | Sakshi
Sakshi News home page

నాకు సిగ్గు ఎక్కువ!

Jul 4 2018 8:30 AM | Updated on Jul 4 2018 8:44 AM

Keerthy Suresh Rejects Glamour Roles In Previous Movies - Sakshi

నటి కీర్తీసురేశ్‌

తమిళసినిమా: ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో నటి కీర్తీసురేశ్‌ పేరే నానుతోందని చెప్పవచ్చు. మహానటి చిత్రం తరువాత ఈ సుందరి రేంజే మారిపోయింది. మహానటి సావిత్రినే వెండితెరపై మరపించిన కీర్తీసురేశ్‌ ఆ తరువాత తెలుగులో ఒక్క చిత్రం కూడా అంగీకరించలేదు. అయితే అందుకు కారణాన్ని కూడా కీర్తి వివరించింది. తమిళంలో అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో విజయ్‌కు జంటగా సర్కార్, విశాల్‌తో సండైకోళి–2, విక్రమ్‌ సరసన సామి చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా తెలుగులో ఎన్‌టీఆర్‌ బయోపిక్‌లో మరోసారి సావిత్రిగా జీవించే అవకాశం ఈ బ్యూటీనే వరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కీర్తీసురేశ్‌ ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో పక్కింటి అమ్మాయిగానే కనిపించింది.

ఎలాంటి లిప్‌ లాక్‌ సన్నివేశాల్లోనూ, గ్లామరస్‌ పాత్రల్లోనూ నటించలేదు. దీంతో చుంభన దృశ్యాల్లో నటిస్తారా? అన్న ప్రశ్నకు ఈ అమ్మడు బదులిస్తూ, తాను నటించడానికి సిద్ధం అయినప్పుడే కమర్శియల్‌ చిత్రాల హీరోయిన్లకు గ్లామర్‌ విషయంలో ఎల్లలు ఉండకూడదూ, ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి తయారుగా ఉండాలి, ముద్దు సన్నివేశాల్లోనూ నటించాల్సి ఉంటే నో అని చెప్పకూడదు అని చెప్పారంది. అయితే ఇంత వరకూ తాను నటించిన ఏ చిత్రంలోనూ అలాంటి సన్నివేశాలు చోటు చేసుకోలేదని చెప్పింది. తాను నటించిన చిత్రాల దర్శకులెవరూ లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించమని బలవంతపెట్టలేదని చెప్పింది. ఈ విషయంలో తాను లక్కీనేనని పేర్కొంది. నిజానికి తకు ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పింది. కారణం తనకు కాస్త సిగ్గు ఎక్కువేనని అంది. ప్రేమ సన్నివేశాల్లో నటించడానికే బిడియ పడతానని చెప్పింది. తాను గ్లామరస్‌గా నటించడానికి నిరాకరించడం వల్లే మహానటి చిత్రం తరువాత అ వకాశాలు తగ్గాయనే ప్రచారంలో నిజం లేదని, తమిళంలో చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నానని కీర్తీసురేశ్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement