ఆ డైలాగ్ కేసీఆర్దే- అల్లు అర్జున్ | KCR Inspiration For Allu Arjun | Sakshi
Sakshi News home page

ఆ డైలాగ్ కేసీఆర్దే- అల్లు అర్జున్

Apr 17 2016 5:04 PM | Updated on Jul 14 2019 3:40 PM

సినిమా సినిమాకి ఆసక్తికరమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు యువ హీరో అల్లు అర్జున్. అర్జున్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రలు ఒక ఎత్తైతే.. 'రుద్రమదేవి'లో పోషించిన గోనగన్నారెడ్డి పాత్ర మరో ఎత్తు.

కేసీఆర్ డైలాగ్నే వాడేసుకున్నానంటున్నాడు అల్లు అర్జున్. సినిమా సినిమాకి ఆసక్తికరమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు ఈ యువ హీరో. అర్జున్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రలు ఒక ఎత్తైతే.. 'రుద్రమదేవి'లో పోషించిన గోనగన్నారెడ్డి పాత్ర మరో ఎత్తు. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ అభినయం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పలువురి ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్రలో అల్లు అర్జున్  ఊతపదం 'గమ్మునుండవయ్' అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ డైలాగ్ కేసీఆర్దేనంటూ అల్లు అర్జున్ ఇటీవల ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. 
 
గోన గన్నారెడ్డి పాత్ర చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తెలంగాణ యాసను పూర్తిగా ఒంటబట్టించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశానన్నాడు అల్లు అర్జున్. ఆ క్రమంలోనే రాష్ట్ర విభజనకు ముందు సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలను పదే పదే చూసేవాడట. ఆయన ఎక్కువగా 'గమ్మునుండవయ్య' అనే మాట వాడుతుండటం గమనించాడు. ఈ మాట అయితే ప్రేక్షకులు సులువుగా కనెక్ట్ అవుతారని డిసైడ్ అయ్యాడట. సినిమా విడుదలయ్యాక నిజంగానే అందరూ ఆ పాత్ర తీరుకు, ఆ మాటకు ఫిదా అయిపోయారు. 'ఆ డైలాగ్కి కేసీఆరే నాకు ఇన్స్పిరేషన్' అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు గోనగన్నారెడ్డి. రూపాయి పారితోషికం తీసుకోకుండా రుద్రమదేవిలో నటించానని చెప్పిన అల్లు అర్జున్, ఆ పాత్ర జీవితంలో మర్చిపోలేనిదంటూ మరోసారి గుర్తుచేసుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement