కట్టప్పకు అరుదైన గౌరవం | Kattappa Sathyaraj Wax Statue in London Museum | Sakshi
Sakshi News home page

Mar 12 2018 8:57 AM | Updated on Mar 12 2018 12:17 PM

Kattappa Sathyaraj Wax Statue in London Museum - Sakshi

బాహుబలిలో కట్టప్పగా సత్యరాజ్‌

సాక్షి, సినిమా : బాహుబలి సిరీస్‌లో కట్టప్ప పాత్రకు దక్కిన గుర్తింపు అంతా ఇంతా కాదు. మాషిష్మతి రాజ్యానికి, సింహాసనానికి.. నమ్మిన బంటుగా ఉండే పాత్రలో నటుడు సత్యరాజ్‌ మెప్పించగా.. దర్శకధీరుడు రాజమౌళి ఆ పాత్రను అద్భుతంగా తీర్చి దిద్దడంతో జనాలు బాగా కనెక్ట్‌ అయ్యారు. అయితే ఆ కట్టప్ప అలియాస్‌ సత్యరాజ్‌కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది.

లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో కట్టప్ప మైనం విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో కట్టప్ప రూపంలో ఉన్న సత్యరాజ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మ్యూజియం నిర్వాహకులు ప్రకటించారు. ఈ విషయాన్ని కోలీవుడ్‌ మీడియా, సత్యరాజ్‌ తనయుడు శిబి సత్యారాజ్‌ కూడా ధృవీకరించారు. 

ఇక్కడ మరో విశేషం ఏంటంటే... మేడమ్‌ టుస్సాడ్‌లో విగ్రహ ఏర్పాటు గౌరవం అందుకున్న తొలి తమిళ నటుడు సత్యరాజ్‌ కావటం. అంతకు ముందు బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్‌ విగ్రహాన్ని కూడా బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో నెలకొల్పిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement