బ్రాండ్... కత్రినా | Katrina Kaif Talks About Tiger Zinda Hai And Working With Salman Khan After 4 Years | Sakshi
Sakshi News home page

బ్రాండ్... కత్రినా

Sep 26 2016 11:33 PM | Updated on Sep 4 2017 3:05 PM

బ్రాండ్... కత్రినా

బ్రాండ్... కత్రినా

హీరోయిన్ కాక ముందు కత్రినా కైఫ్ మోడల్‌గా పనిచేశారు. 14 ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేశారామె.

 హీరోయిన్ కాక ముందు కత్రినా కైఫ్ మోడల్‌గా పనిచేశారు. 14 ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేశారామె. లేటెస్ట్ ఫ్యాషన్స్, స్టైల్స్, ట్రెండ్స్‌పై చాలా అవగాహన ఉంది. ఇప్పుడు హీరోయిన్‌గా ఇండియాలో మంచి పాపులారిటీ ఉంది. ఈ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. బ్రాండ్ కత్రినా పేరుతో ఓ ఫ్యాషన్ లేబుల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే.. దుస్తులు అమ్మడం అన్నమాట. లాస్ట్ టైమ్ లండన్ వెళ్లినప్పుడు ఫ్యాషన్ లేబుల్ గురించి అక్కడ నిపుణులతో డిస్కస్ చేశారట.
 
 సోనమ్ కపూర్, దీపికా పదుకునే, కరీనా కపూర్, బిపాసా బసు, అలియా భట్, లారా దత్తాలు... ఎప్పుడో తమ పేరు మీద ఫ్యాషన్ లేబుల్ స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచో మనసులో ఈ ఆలోచన ఉన్నప్పటికీ.. కత్రినా కైఫ్ కాస్త లేటుగా స్టార్ట్ చేస్తున్నారు. ‘‘నిజమే... నా పేరుతో ఫ్యాషన్ లేబుల్ స్టార్ట్ చేస్తున్నా. వివరాలు ఇప్పుడే చెప్పలేను. త్వరలో అధికారికంగా ప్రకటిస్తా’’ అన్నారు కత్రినా కైఫ్. మాజీ ప్రేమికులు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నాలుగేళ్ల తర్వాత ‘ఏక్ థా టైగర్’ సీక్వెల్ ‘టైగర్ జిందా హై’లో జంటగా నటించనున్నారు. ఈ నాలుగేళ్లలో నా జీవితంతో పాటు ఈ ప్రపంచంలో చాలా మార్పులొచ్చాయన్నారు. ఈ మాటలకు కారణం మధ్యలో రణ్‌బీర్ కపూర్‌తో లవ్, బ్రేకప్ అంటారా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement