కత్రినా పెళ్లి కూతురాయెనె! | Katrina Kaif Sports A Bengali Bride Look In Her Upcoming Film Zero | Sakshi
Sakshi News home page

కత్రినా పెళ్లి కూతురాయెనె!

Apr 13 2018 12:17 AM | Updated on Apr 13 2018 12:17 AM

Katrina Kaif Sports A Bengali Bride Look In Her Upcoming Film Zero - Sakshi

కత్రినా కైఫ్

ప్రజెంట్‌ బీటౌన్‌లో పెళ్లి గాలి బాగా వీస్తోంది. విరాట్‌ కోహ్లితో ఆల్రెడీ హీరోయిన్‌ అనుష్కా శర్మ ఏడడుగులు వేశారు. మరో కథానాయిక సోనమ్‌ కపూర్‌ కూడా తన బాయ్‌ఫ్రెండ్‌  ఆనంద్‌ అహుజాతో వచ్చే నెల ఫస్ట్‌ వీక్‌లో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ టైమ్‌లో పెళ్లికూతురు గెటప్‌లో కనిపించారు కత్రినా కైఫ్‌. తాను ఆ గెటప్‌లో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు కత్రినా. అంతే... కత్రినా పెళ్లి కూతురాయెనే అని బీటౌన్‌లో టామ్‌ టామ్‌ చేశారు కొందరు. అయితే కత్రినా కైఫ్‌ పెళ్లికూతురయ్యారు కానీ నిజ జీవితంలో కాదు. సినిమా జీవితంలో.

ఆనంద్‌. ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జీరో’. ఇందులో కత్రినా కైఫ్, అనుష్కా శర్మ కథానాయికలు. ఈ సినిమాలో కత్రినా పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించనున్నారు. ఇందులో ఆల్కహాల్‌కు ఎడికై్టన అమ్మాయి పాత్రలో కత్రినాకైఫ్, సైంటిస్ట్‌గా సక్సెస్‌ సాధించాలని స్ట్రగులయ్యే పాత్రలో అనుష్కా శర్మ కనిపించనున్నారని బాలీవుడ్‌ టాక్‌. ఈ సినిమాలో షారుక్‌ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘జీరో’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ 21న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ తర్వాత షారుక్, అనుష్క, కత్రినా కలిసి నటించిన ఈ సినిమా పై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

లైఫ్‌ జర్నీతో బుక్‌: కత్రినా తన లైఫ్‌ జర్నీని ఒక పుస్తక రూపంలో (ఆటోబయోగ్రఫీ) రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. ఈ ఆటోబయోగ్రఫీ కోసం ఆల్రెడీ ఒక పబ్లిషింగ్‌ హౌస్‌తో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారమ్‌. ఈ బుక్‌లో ముఖ్యంగా తన బాల్యాన్ని, లండన్, జపాన్, ఇండియా ఇలా వివిధ దేశాల్లో ఉండటం వల్ల తన లైఫ్‌లో సంస్కృతులు చూపిన ప్రభావం, బాలీవుడ్‌లో 15 ఏళ్ల కెరీర్‌ను ఎక్కువగా ప్రస్తావించనున్నారట. ఈ బుక్‌ ఇన్‌స్పిరేషనల్‌గా ఉండబోతోందట.

Advertisement
 
Advertisement
Advertisement