కత్రినా - సల్మాన్.. ఓ హాట్ ఫొటో! | katrina kaif shares photo with topless salman | Sakshi
Sakshi News home page

కత్రినా - సల్మాన్.. ఓ హాట్ ఫొటో!

May 16 2017 5:41 PM | Updated on Sep 5 2017 11:18 AM

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న 'టైగర్ జిందా హై' సినిమా షూటింగ్ దాదాపు ముగిసిపోతోంది. దాంతో కత్రినా కూడా కాస్త విశ్రాంతి తీసుకునే మూడ్ లోకి వచ్చేసింది.

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న 'టైగర్ జిందా హై' సినిమా షూటింగ్ దాదాపు ముగిసిపోతోంది. దాంతో కత్రినా కూడా కాస్త విశ్రాంతి తీసుకునే మూడ్ లోకి వచ్చేసింది. గతంలో 'చిక్‌నీ చమేలి' అంటూ అదరగొట్టే డాన్సులు చేసిన కత్రినా.. తాజాగా తన స్మార్ట్‌ఫోన్‌తో ఫొటోలు తీసుకుంటూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసే పనిలో యమ బిజీగా ఉంది. అయితే, తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో క్యాట్ అప్‌లోడ్ చేసిన ఓ ఫొటోకు విపరీతంగా కామెంట్లు వచ్చాయి. తన కో-స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి తీసుకున్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఆమె షేర్ చేసింది. అందులో సల్లూభాయ్ ఎప్పటిలాగే చొక్కా విప్పేసి చిన్న నిక్కర్ మాత్రమే ధరించి ఉండగా.. కత్రినా కూడా మంచి హాట్ పోజులో కనిపించింది. ఆ పక్కనే వైన్ గ్లాసులు కూడా మూడు నాలుగు కనిపిస్తున్నాయి.

మాజీ ప్రేయసీ ప్రియులైన వీళ్లిద్దరూ తెరమీద కనిపించి ఇప్పటికి ఐదేళ్లు అవుతోంది. దాంతో వీళ్లిద్దరి ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చూసేందుకు ఫ్యాన్స్ తెగ తొందరపడుతున్నారు. ఇంతకుముందు ఈ సినిమా ప్రీక్వెల్ అయిన ఏక్ థా టైగర్ విడుదలయ్యే సమయానికి వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని విపరీతంగా రూమర్లు వచ్చాయి. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వస్తున్న టైగర్ జిందా హై సినిమా ఈ డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉంది. దీని తర్వాత ఆమిర్ ఖాన్ సరసన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలో కత్రినా నటించబోతోంది. ఈ విషయాన్ని అటు ఆమిర్ ఖాన్, ఇటు సల్మాన్ ఖాన్ ఇద్దరూ ట్వీట్ చేశారు. వాళ్లిద్దరి సంగతి ఎలా ఉన్నా కత్రినా మాత్రం ఇలాంటి హాట్ ఫొటోలతో అభిమానుల మతి పోగొడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement