సుభాష్‌ ఘాయ్‌... కేస్‌ గయా | Kate Sharma Withdraws Sexual Harassment Case Against | Sakshi
Sakshi News home page

సుభాష్‌ ఘాయ్‌... కేస్‌ గయా

Nov 25 2018 2:21 AM | Updated on Nov 25 2018 9:20 AM

Kate Sharma Withdraws Sexual Harassment Case Against - Sakshi

‘తాల్, ఖల్‌నాయక్‌’ వంటి చిత్రాలను రూపొందించిన బాలీవుడ్‌ దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌ మీద లైంగిక వేధింపుల ఆరోపణ చేశారు మోడల్‌ కేట్‌ శర్మ. తనతో తప్పుగా ప్రవర్తించాడని, మానసికంగా టార్చర్‌ చేశాడని గత నెల ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ కూడా చేశారామె. నెలన్నర తర్వాత ఆ  కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.  కేసు వెనక్కి తీసుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ – ‘‘మా అమ్మగారికి  ఆరోగ్యం బాగాలేదు. మా ఇంట్లోవాళ్లను చూసుకోవాలి.

నాకు జరిగిపోయినదాని గురించి న్యాయం కోసం పరుగులు తీయలేను. ఇప్పటికే అన్నింటికీ విసిగిపోయాను’’ అన్నారు. ఇంకా ‘మీటూ’ ఉద్యమం గురించి మాట్లాడుతూ – ‘‘మీటూ’ గురించి చాలా మంది జోక్‌ చేస్తున్నారు. ఇంతమంది బయటకు వచ్చి చెబుతున్నా ఇంకా ఎవ్వరినీ అరెస్ట్‌ చేయలేదు. పోరాటం చేయడానికి గల కారణం నాకు కనిపించడం లేదు. నేను చెప్పాల్సిందంతా పబ్లిక్‌ ప్లాట్‌ఫార్మ్‌ లోనే ఉంది. నేను, సుభాష్‌ ఘాయ్‌ ఫ్రెండ్స్‌.  కానీ ఆ స్నేహం నిలిచేలా అతను ప్రవర్తించలేదు’’ అని పేర్కొన్నారు కేట్‌ శర్మ.

Advertisement
 
Advertisement
Advertisement