కాటమరాయుడుకు 'యూ' సర్టిఫికెట్‌ | Katamarayudu gets U certificate from the censor board | Sakshi
Sakshi News home page

'కాటమరాయుడు' నిడివి ఎంతో తెలుసా?

Mar 15 2017 6:30 PM | Updated on Mar 22 2019 5:33 PM

కాటమరాయుడుకు 'యూ' సర్టిఫికెట్‌ - Sakshi

కాటమరాయుడుకు 'యూ' సర్టిఫికెట్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన కాటమరాయుడు చిత్రానికి 'యూ' సర్టిఫికెట్‌ లభించింది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన కాటమరాయుడు చిత్రానికి 'యూ' సర్టిఫికెట్‌ లభించింది. సెన్సార్ బృందం బుధవారం ఈ చిత్రానికి 'యూ' సర్టిఫికెట్ జారీ చేసింది. కాటమరాయుడు మార్చి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నిడివి 2 గంటల 24 నిమిషాలు ఉండనుందట. ప్రస్తుతం టాలీవుడ్‌లో కాటమరాయుడు ఫీవర్‌ నడుస్తోంది. ఈ చిత్రం గురించి రోజుకో వార్త వెలువడుతున్న విషయం తెలిసిందే. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ (కిశోర్ పార్థసాని) దర్శకుడు. ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తుండగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.

కాటమరాయుడు చిత్రంలో పవన్ పక్కా మాస్ లుక్ లో ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. టీజర్‌కు ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయిలో ఆన్‌లైన్‌లో వ్యూస్‌ దక్కాయి. దీంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు మార్చి 18న భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ ప్లాన్ చేస్తోంది. అదే రోజున థియట్రికల్ ట్రైలర్ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement