కండలవీరుడు గుణ

karthikeya new movie guna 369 first look release - Sakshi

ఫొటోలో ఉన్న ఈ కండలవీరుడు ఎవరో తెలుసా? ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ పేరు చెబితే కార్తికేయ అని ఇట్టే చెప్పేస్తారు. ఫస్ట్‌ సినిమా ‘ఆర్‌ఎక్స్‌ 100’తో అంత పాపులర్‌ అయ్యారు కార్తికేయ. ఇప్పుడు అతను హీరోగా బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. స్ప్రింట్‌ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గుణ 369’ అనే పేరు ఖరారు చేసి, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ– ‘‘హీరో పేరు గుణ. ‘369’ అంటే ఏంటనేది స్క్రీన్‌ పైనే చూడాలి. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్‌ చేస్తున్నాం.

ఇటీవలే క్రొయేషియాలో 2 పాటలు తీశాం. ఒంగోలులో ఇప్పటికే ఓ భారీ షెడ్యూల్‌ చేశాం. ఈ నెల 29 నుంచి మే 15 వరకు చేయబోయే  భారీ షెడ్యూల్‌తో ఒక పాట మినహా సినిమా పూర్తవుతుంది’’ అన్నారు. ‘‘రియల్‌ లైఫ్‌ ఇన్సిడెంట్స్‌తో అర్జున్‌ ఈ కథను తయారు చేసుకున్నాడు. లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జోనర్‌లో ఉంటుంది’’ అన్నారు అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి. ‘‘కొన్ని కథలు వినగానే నలుగురితో పంచుకోవాలనిపిస్తుంటాయి. అర్జున్‌ జంధ్యాల చెప్పిన కథ అలాంటిదే. ఇప్పటిదాకా తీసిన రషెస్‌ చూసుకున్నాం.. ప్రతి ఫ్రేమ్‌ రియలిస్టిక్‌గా వచ్చింది’’ అన్నారు కార్తికేయ. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరద్వాజ్, కెమెరా: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శివ మల్లాల.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top