చైతూ సినిమాలో ‘ఆర్ఎక్స్‌ 100’ హీరో

Karthikeya is Likely to be Play a Cameo in Ajay And Chaitanya Film - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఘన విజయం సాధించిన కార్తికేయ ప్రస్తుతం హిప్పీ, గుణ 369 చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాదు నాని హీరోగా విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌ లీడర్‌ సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలోనూ నటిస్తున్నాడు. తాజాగా మరో యంగ్ హీరోతో కలిసి నటించేందుకు కార్తికేయ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.

కార్తికేయకు బ్రేక్‌ ఇచ్చిన అజయ్‌ భూపతి తన తదుపరి చిత్రం ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు కార్తికేయను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అజయ్‌ అడగటంతో కార్తికేయ కూడా వెంటనే ఒప్పేసుకున్నాడట. ఈ సినిమాలో చైతూకు జోడిగా సమంత నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top