
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న మహిళ, పురుషుల టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ వేడుక మెల్‌బోర్న్‌లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో వరల్డ్ కప్ ట్రోఫీని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది తనకు దక్కిన అరుదైన గౌరమంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇంతటి ప్రఖ్యాత కార్యక్రమంలో తను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. అలాగే మహిళా క్రికెటర్లంతా తమ కలలను సాకారం చేసుకునే దిశగా వారిని ప్రోత్సహించాలనుకుంటున్నానని చెప్పారు. ఇంతటి అంతర్జాతీయ టోర్నీలో వారు పాల్గొనడం గొప్ప విషయమని, వారు అందరికీ ఆదర్శమని ఆమె కొనియాడారు.
తన మామయ్య (మన్సూర్ పటౌడీ అలీఖాన్) కూడా ప్రముఖ క్రికెటర్ అని కరీనా గుర్తు చేశారు. ప్రపంచమంతా అత్యంత ఆదరణ ఉన్న ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణకు తనను ఆహ్వనించడం తనకు దక్కిన అత్యంత గౌరవని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి8వ తేదీ వరకు మహిళా క్రికెట్ టీ-20 వరల్ కప్ జరగనుండగా.. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు పురుషుల టోర్నీ జరగనుంది. సినిమాల విషయానికి వస్తే కరీనా కపూర్ అక్షయ్ కుమార్, కైరా అద్వానిలతో కలిసి ‘గుడ్ న్యూస్’ సినిమాలో కనిపించనుంది. అలాగే అమీర్ ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’లో కూడా నటిస్తున్నారు.