బాలీవుడ్ జేజమ్మ ఎవరంటే? | Kareena Kapoor To Play Anushka Shetty's Role In Arundhati | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ జేజమ్మ ఎవరంటే?

Sep 22 2019 11:51 AM | Updated on Sep 22 2019 2:39 PM

Kareena Kapoor To Play Anushka Shetty's Role In Arundhati - Sakshi

స్వీటీ అనుష్కకు టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ తెచ్చిపెట్టిన సూపర్‌ హిట్ సినిమా అరుంధతి. ఈ సినిమాతో అనుష్క లేడీ సూపర్‌ స్టార్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. 2009లో రిలీజ్ అయినా ఈ సినిమా సౌత్‌లో సెన్సేషన్‌ సృష్టించటంతో అప్పట్లోనే బాలీవుడ్ రీమేక్‌పై వార్తలు వినిపించాయి. అయితే అనుకున్నట్టుగా ప్రాజెక్ట్‌ సెట్‌ కాకపోవటంతో వాయిదా పడుతూ వస్తోంది.

తాజాగా బాలీవుడ్‌లో సౌత్‌ సినిమాల రీమేక్‌లు ఘనవిజయం సాధిస్తున్న నేపథ్యంలో మరోసారి అరుంధతి రీమేక్‌ తెర మీదకు వచ్చింది. బాలీవుడ్‌లో జేజమ్మ పాత్రకు కరీనా కపూర్‌ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. పెళ్లి తరువాత షార్ట్‌ గ్యాప్‌ తీసుకున్న కరీనా ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీషోస్‌తోనూ బిజీగా ఉంది. ఒకవేళ కరీనా అరుంధతి పాత్రకు నో అన్న పక్షంలో అనుష్క శర్మను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి చిత్రాన్ని బాలీవుడ్‌లో ఎవరు డైరెక్ట్‌ చేయనున్నారన్న విషయం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement