చిన్న నవాబ్‌ వచ్చేశాడు | Kareena Kapoor and Saif Ali Khan's son is finally here! | Sakshi
Sakshi News home page

చిన్న నవాబ్‌ వచ్చేశాడు

Dec 21 2016 12:43 AM | Updated on Sep 4 2017 11:12 PM

చిన్న నవాబ్‌ వచ్చేశాడు

చిన్న నవాబ్‌ వచ్చేశాడు

మంగళవారం సైఫ్‌ అలీఖాన్, కరీనా కపూర్‌లకు జీవితంలో మరచిపోలేని రోజు. ఈ ఏడాది వాళ్లకు తీపి గుర్తుగా నిలిచిపో తుంది.

మంగళవారం సైఫ్‌ అలీఖాన్, కరీనా కపూర్‌లకు జీవితంలో మరచిపోలేని రోజు. ఈ ఏడాది వాళ్లకు తీపి గుర్తుగా నిలిచిపో తుంది. 20న ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ హాస్పటల్‌లో కరీనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ‘‘మాకు చాలా ఆనందంగా ఉంది’’ అంటూ భార్యాభర్తలిద్దరూ సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు. బుడతడి పేరు కూడా ప్రకటించారు. ‘‘మా అబ్బాయికి ‘తైముర్‌ అలీఖాన్‌ పటౌడీ అని పేరు పెట్టాం’’ అన్నారు. ఛోటా నవాబ్‌ పుట్టిన వార్త తెలియగానే బాలీవుడ్‌ ప్రముఖులు సైఫ్‌–కరీనాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు’’ అని సైఫ్‌ చెల్లెలు సోహా అలీఖాన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement