‘నీ స్నేహం నన్నెంతగానో ప్రభావితం చేసింది’ | Karan Johar Heart Warming Wishes For Shah Rukh Khan Birthday | Sakshi
Sakshi News home page

‘నీ స్నేహం నన్నెంతగానో ప్రభావితం చేసింది’

Nov 2 2019 3:04 PM | Updated on Nov 7 2019 1:58 PM

Karan Johar Tweets Special Wishes For Shah Rukh Khan Birthday  - Sakshi

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ నేటితో 54 వసంతాలను పూర్తి చేసుకున్నారు. నవంబర్‌ 2వ తేదీ కింగ్‌ ఖాన్‌ బర్త్‌ డే సందర్భంగా అభిమానులు, సన్నిహితులతో పాటు ప్రముఖుల శుభాకాంక్షలు తెలిపారు. కాగా చిత్ర నిర్మాత, కింగ్‌ ఖాన్‌ చిరకాల స్నేహితుడు కరణ్‌ జోహర్‌ తెలిపిన విషెస్‌ వాటన్నింటిలో కంటే ప్రత్యేకంగా నిలిచాయి.  వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి చెబుతూ  కరణ్‌ జోహర్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘హ్యపీ బర్త్‌ డే భాయ్‌’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ పోస్ట్‌లో ‘కొన్ని బంధాలను వివరించడానికి పదాలు సరిపోతాయానేది నేను కచ్చితంగా చేప్పలేను కానీ.. ప్రత్యేకించి వాటి కోసం శక్తివంతమైన నిశబ్దం మాత్రం ఉంది. నువ్వు నా జీవితంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తివి.. నీ స్నేహం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది’ అని రాసుకొచ్చాడు.

కాగా కరణ్‌ జోహర్‌ మొదటి సారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’లో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే విరిద్దరు మంచి స్నేహితులు అయ్యారని కరణ్‌​ పేర్కొన్నారు. తర్వాత యష్‌ చోప్రా నిర్మించిన ‘దిల్‌ వాలె దుల్షానియా లే జాయేంగే’చిత్రానికి కరణ్‌ దర్శకత్వం వహించగా, షారుక్‌ కథానాయకుడిగా నటించిన విషయం విదితమే. ఆ తర్వాత ‘కబీ ఖుషి కబి గమ్‌’, ‘కభీ అల్వీదా నా కహనా’, ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌’ వంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు వచ్చి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement