సల్మాన్‌తో పోటీనా..? : కరణ్‌ జోహర్‌

Karan Johar Comment On Salman Race3 Over His Lust Stories Web Series - Sakshi

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ రేస్‌ 3 ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ ట్రెండింగ్‌లో ఉంది. సల్మాన్‌ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్‌ బద్దలవ్వాల్సిందే. రేస్‌ 3 జూన్‌ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే అదే రోజున లస్ట్‌ స్టోరిస్‌ అంటూ ఓ వెబ్‌ సిరీస్‌ విడుదలవుతోంది. 

ఈ వెబ్‌ సిరీస్‌కు నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు. అందులో కరణ్‌ జోహర్‌ ఒకరు. ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... సల్మాన​తో పోటీ పడదామనుకుంటున్నారా అంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు... ‘సల్మాన్‌తో పోటీపడేంతా మాకు లేదు. మా వెబ్‌ సిరీస్‌ లస్ట్‌ స్టోరీస్‌కు సల్మాన్‌ రేస్‌3కు సంబంధమే లేదు. సల్మాన్‌ రేంజ్‌ వేరు. నేను కూడా జూన్‌ 15న సల్మాన్‌ రేస్‌3 మూవీనే చూస్తాను’ అంటూ కరణ్‌ చెప్పుకొచ్చారు. లస్ట్‌ స్టోరిస్‌లో నలుగురు వ్యక్తులకు సంబంధించిన కథలను చూపించనున్నారు. రాధికా ఆప్టే, కియారా అద్వాణీ, మనీషా కొయిరాలా, భూమీ ఫెడ్నేకర్‌లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను కరణ్‌ జోహర్‌, జోయా అక్తర్‌, దిబాకర్‌ బెనర్జీ, అనురాగ్‌ కశ్యప్‌లు డైరెక్ట్‌ చేయనున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top