జాన్వీ.. అర్జున్‌రెడ్డి ఎలా మిస్సయ్యింది? | Karan Johar Behind Janhvi drop out of Arjun Reddy Remake | Sakshi
Sakshi News home page

Jul 2 2018 1:35 PM | Updated on Jul 2 2018 6:04 PM

Karan Johar Behind Janhvi drop out of Arjun Reddy Remake - Sakshi

టాలీవుడ్‌ సెన్సేషన్‌ మూవీ అర్జున్‌రెడ్డి బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. షాహిద్‌ కపూర్‌-తార సుటారియా జంటగా మాతృక దర్శకుడు సందీప్‌ వంగ ఈ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నాడు. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ చిత్రం కోసం తొలుత జాన్వీ కపూర్‌ పేరును పరిశీలించారన్న వార్త ఒకటి ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది.  

‘నిజానికి జాన్వీ కపూర్‌నే అర్జున్‌ రెడ్డి రీమేక్‌ కోసం తొలుత సంప్రదించారు. అయితే ప్రముఖ దర్శక-నిర్మాత, ఆమె మెంటర్‌ అయిన కరణ్‌ జోహర్‌ అందుకు ఒప్పుకోలేదు. కెరీర్‌ ప్రారంభంలోనే బోల్డ్‌ సినిమాలు చేయటం మంచిది కాదని కరణ్‌.. జాన్వీకి సూచించాడంట. దీంతో జాన్వీ ఈ ప్రాజెక్టు చేసేందుకు విముఖత వ్యక్తం చేశారంట. అంతేకాదు తార పేరును కూడా అర్జున్‌ రెడ్డి రీమేక్‌కు సూచించింది కరణే’ అని ఓ ప్రముఖ బాలీవుడ్‌ మాగ్జైన్‌ కథనం ప్రచురించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం జాన్వీ నటించిన ధడక్‌ ఈ నెలలోనే విడుదల కానుంది. ప్రస్తుతం ఇషాన్‌, జాన్వీలు చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.  శశాంక్‌ ఖైటన్‌ దర్శకత్వంలో మరాఠీ హిట్‌ సైరాట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ధడక్‌ జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement