మనసుకు హత్తుకునేలా... | kannullo nee roopame movie released on june 29 | Sakshi
Sakshi News home page

మనసుకు హత్తుకునేలా...

Jun 22 2018 12:26 AM | Updated on Jun 22 2018 12:26 AM

kannullo nee roopame movie released on june 29 - Sakshi

బిక్స్‌ ఇరుసుడ్ల, రామ్మోహన్, భాస్కర్‌ భాసాని

నందు, తేజస్వినీ ప్రకాష్‌ జంటగా బిక్స్‌ ఇరుసడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. ఏఎస్‌పీ క్రియేటివ్‌ పతాకంపై భాస్కర్‌ భాసాని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. హరి హర చలనచిత్రం నిర్మాతలు ఇప్పిలి రామ్మోహన్‌రావు, ఎస్‌. శ్రీకాంత్‌రెడ్డి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత భాస్కర్‌ భాసాని మాట్లాడుతూ – ‘‘ఆడియోకి మంచి స్పందన లభించింది. సినిమా కూడా మనసుకు హత్తుకునేలా ఉంటుంది.

నిర్మాతలు ఇప్పిలి రామ్మోహన్‌రావు, ఎస్‌. శ్రీకాంత్‌రెడ్డి మా చిత్రం చూసిన తర్వాత, వారి హరిహర చలన చిత్రం బ్యానర్‌లో విడుదల చేస్తాం అని మాకు ధైర్యాన్ని ఇచ్చారు. వారికి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘నేను, శ్రీకాంత్‌రెడ్డి సినిమా చూసిన వెంటనే చిరుసాయం చేయాలని నిర్ణయించుకున్నాం. స్టోరీ తగ్గట్లుగా కాంప్రమైజ్‌ కాకుండా తీశారు. డైరెక్టర్‌గా బిక్స్‌ సక్సెస్‌ సాధించారనిపిస్తోంది’’ అన్నారు రామ్మోహన్‌రావు. ‘‘నందు, తేజస్వినీ బాగా నటించారు. టీమ్‌ అందరూ బాగా సపోర్ట్‌ చేశారు. హరిహర చలనచిత్రం నిర్మాతలు మా చిత్రాన్ని రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు డైరెక్టర్‌ బిక్స్‌. ఈ చిత్రానికి సంగీతం: సాకేత్‌ కోమండురి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement