ప్రతి నిమిషం ప్రేమించే పోటుగాడు లేదు.. ట్రైలర్ రిలీజ్ | Nandu Ugly Story Movie Trailer | Sakshi
Sakshi News home page

Ugly Story Trailer: సైకోగా నందు.. 'అగ్లీ స్టోరీ' ట్రైలర్

May 6 2026 2:23 PM | Updated on May 6 2026 2:34 PM

Nandu Ugly Story Movie Trailer

సహాయ పాత్రలు చేసి గుర్తింపు పొందిన నందు.. ఈ మధ్య కాలంలో లీడ్ రోల్స్ చేస్తున్నాడు గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఈ ఏడాది ప్రారంభంలో 'సైక్ సిద్ధార్థ' అంటూ వచ్చాడు గానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి సైకో తరహా పాత్రతో వచ్చేస్తున్నాడు. ‍'అగ్లీ స్టోరీ' పేరుతో తీసిన ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి జ్యోతిక కోర్ట్ రూమ్ సినిమా)

భార్యపై అతి ప్రేమ చూపించి, ఆమెని అతిగా ప్రేమించే సైకోలా నందు నటించాడు. ఇతడి భార్యగా అవికా గోర్ చేసింది. వీళ్లిద్దరి జీవితంలో 'ప్రేమ' అనేది ఎంతటి విధ్వంసానికి కారణమైంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. నందుకి ఈసారైనా సక్సెస్ దక్కుతుందో లేదో చూడాలి?

(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్‌కి ఊహించని అవకాశం?)

Advertisement
 
Advertisement
Advertisement