హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం | Kannada Actor Chiranjeevi Sarja Passed Away Due To Illness | Sakshi
Sakshi News home page

హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం

Jun 7 2020 5:08 PM | Updated on Jun 7 2020 5:38 PM

Kannada Actor Chiranjeevi Sarja Passed Away Due To Illness - Sakshi

ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా (39) గుండెపోటుతో ఆదివారం హఠాన్మరణం చెందారు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన స్వయానా మేనల్లుడు.

బెంగుళూరు: కన్నడ చిత్రసీమంలో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా (39) గుండెపోటుతో ఆదివారం హఠాన్మరణం చెందారు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన మేనల్లుడు. జూన్ 6న చిరంజీవి సర్జాకు శ్వాసకోస సమస్య రావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయన వయసు తక్కువే కావడంతో ఇది హృదయ సంబంధ వ్యాధి అని ఎవరూ అనుకోలేదు.

కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన చిరంజీవికి తీవ్రమైన ఛాతీ నొప్పి కూడా వచ్చినట్టు తెలిసింది. దాంతో ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చిరంజీవి సర్జా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఆకే, సింగా, సంహారా వంటి విజయవంతమైన సినిమాల్లో హీరోగా నటించారు. చిరంజీవికి నటి మేఘనా రాజ్‌తో 2018లో వివాహం జరిగింది. ఇక ఆయన సోదరుడు ధ్రువ సర్జా కూడా సినిమా ఇండస్ట్రీలోనే నటుడిగా ఉన్నారు. భర్త ఆకస్మిక మృతితో మేఘనా రాజ్ కుప్పకూలిపోయింది. అభిమానులు, సినీ ప్రముఖులు హీరో మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు.

సర్జా– మేఘన జంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement