కరోనాపై గెలిచిన బాలీవుడ్ గాయ‌ని | Kanika Kapoor discharged from Lucknow hospital | Sakshi
Sakshi News home page

కరోనాపై గెలిచిన బాలీవుడ్ గాయ‌ని

Apr 6 2020 11:08 AM | Updated on Apr 6 2020 12:43 PM

Kanika Kapoor discharged from Lucknow hospital - Sakshi

లక్నో: బాలీవుడ్ గాయ‌ని క‌నికా క‌పూర్‌ కరోనాపై గెలిచి ఇంటికి చేరుకన్నారు. ఆరోసారి ఆమెకు నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో ఆమెను డిశ్చార్జి చేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సంజ‌య్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ఆసుప‌త్రిలో ఆమె చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు నిర్వహించిన కరోనా నిర్ధారిత తొలి నాలుగు టెస్ట్‌ల్లోనూ పాజిటివ్‌ రావడంతో ఆందోళన వ్యక్తమయింది. అయితే ఐదు, ఆరోసారి నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో ఆమెను డిశ్చార్‌ చేశారు. ఇంటికి చేరుకున్నా, వైద్యుల సూచనలమేరకు 14 రోజులపాటూ క‌నికా క‌పూర్‌ గృహ నిర్బంధంలోనే ఉండనున్నారు.  

కాగా, విదేశాల‌ నుంచి వ‌చ్చిన తర్వాత క‌నికా కపూర్‌ ప‌లు వేడుకల్లో పాల్గోవడం, వాటికి రాజ‌కీయ ప్రముఖుల‌తోపాటు సినీ సెల‌బ్రిటీలు కూడా హాజ‌ర‌వ్వడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క‌నికాకు క‌రోనా సోకింద‌ని నిర్ధార‌ణ కాగానే ఆమెకు స‌న్నిహితంగా మెలిగిన వారంద‌రూ స్వీయ నిర్బంధం విధించుకున్నారు. కనికా కపూర్‌కు కరోనా తగ్గిందని తెలియడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు. భౌతిక దూరం పాటిస్తే కరోనాను సమర్థవంతంగా నిరోధించవచ్చని దీంతో మరోసారి రుజువయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement