లక్ష్మీబాయి బాగుంది కదూ! | Kangana Ranaut's first look as Rani Laxmibai | Sakshi
Sakshi News home page

లక్ష్మీబాయి బాగుంది కదూ!

Apr 13 2017 11:33 PM | Updated on Sep 27 2018 8:48 PM

లక్ష్మీబాయి బాగుంది కదూ! - Sakshi

లక్ష్మీబాయి బాగుంది కదూ!

వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్‌లో కంగనా రనౌత్‌ ఎలా ఉంటారు? కట్టూ బొట్టూ సూట్‌ అవుతుందా?

వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్‌లో కంగనా రనౌత్‌ ఎలా ఉంటారు? కట్టూ బొట్టూ సూట్‌ అవుతుందా? అనే ప్రశ్నల్లో ఓ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. రాణీగా కంగనా ముఖారవిందం ఎలా ఉంటుందో ఓ స్కెచ్‌ ద్వారా దర్శకుడు క్రిష్‌ బయటపెట్టారు. కంగనా టైటిల్‌ రోల్‌లో ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా ఆయన ‘మణికర్ణిక’ పేరుతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం కంగన యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారు. క్రిష్‌ ఏమో ఆమె గెటప్‌ ఎలా ఉండాలి? ఇతర పాత్రధారుల లుక్‌ ఎలా ఉండాలి? షూటింగ్‌ లొకేషన్స్‌ తదితర విషయాలపై కసరత్తులు చేస్తున్నారు.

అర్ధచంద్రాకారంలో బొట్టు, చెవులకు జూకాలు, అందమైన తలపాగా, కురచ జుట్టుతో కంగన లుక్‌ని స్కెచ్‌ వేయించారు. ముఖారవిందం వరకూ వేయించిన ఈ స్కెచ్‌ని చూసినవాళ్లందరూ లక్ష్మీబాయిగా కంగనా రనౌత్‌ చాలా బాగుందంటున్నారు. ఈ శాంపిల్‌ను చూస్తే గెటప్‌ అదిరిపోతుందని అనిపిస్తోంది కదూ. ఇక, నటన పరంగా చెప్పేదేముంది? కంగనా ఆల్రెడీ ప్రూవ్డ్‌. జూన్‌లో షూటింగ్‌ ప్రారంభించాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement