పదిహేడేళ్లకే ప్రేమలో పడ్డా | Kangana Ranaut romances 17 year old | Sakshi
Sakshi News home page

పదిహేడేళ్లకే ప్రేమలో పడ్డా

Oct 5 2019 1:01 AM | Updated on Oct 5 2019 5:27 AM

Kangana Ranaut romances 17 year old - Sakshi

కంగనా రనౌత్‌

‘‘సాధారణంగా కొందరికి వారి తొలి ప్రేమ ఎక్కువ శాతం స్కూల్‌ టీచర్‌తోనే ఉంటుంది. వాళ్లంటే తెలియని ఆకర్షణ ఏర్పడుతుంది. నాక్కూడా ఓ టీచర్‌పై అట్రాక్షన్‌ ఏర్పడింది. కానీ నేను తొలిసారి ప్రేమలో పడింది మాత్రం పదిహేడేళ్ల వయసులోనే’’ అన్నారు కంగనా రనౌత్‌. ఇటీవల జరిగిన ఓ సదస్సులో కంగనా తన తొలి ప్రేమకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ‘‘మేం అప్పుడు (17 ఏళ్ల వయసులో) చండీఘర్‌లో ఉండేవాళ్లం. మా ఫ్రెండ్‌ ఒక అబ్బాయితో డేట్‌కి వెళ్లింది. ఆ అబ్బాయి వాళ్ల ఫ్రెండ్‌తో నేను ఉండాల్సి వచ్చింది. అతను పంజాబీ అబ్బాయి.

చాలా క్యూట్‌గా ఉండేవాడు (నవ్వుతూ). కానీ నా ప్రేమ గురించి అతనికి చెప్పినప్పుడు, నన్ను చూసి ‘నువ్వు చిన్న పిల్లవి’ అన్నాడు. నా గుండె పగిలినంత పని అయింది. ‘నాకొక్క చాన్స్‌ ఇవ్వు, ఎదుగుతాను’ అని మెసేజ్‌లు చేసేదాన్ని. మేం కొన్ని రోజులు డేటింగ్‌ చేసి, విడిపోయాం. నిజానికి నాకు ముద్దు పెట్టడం కూడా సరిగ్గా వచ్చేది కాదు. అతనికి ఎలా ముద్దు పెట్టాలని నా అరచేతిని ముద్దాడుతూ ముద్దుపెట్టడం ప్రాక్టీస్‌ చేసేదాన్ని. అతనితో నా తొలి ముద్దు కూడా అంత మ్యాజికల్‌గా ఏం జరగలేదు. ముద్దుపెట్టుకునే సమయానికి బిగుసుకుపోయాను’’ అని టీనేజ్‌ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement